Kakani Govardhan Reddy: కాకాణికి సుప్రీంలో ముందస్తు బెయిల్‌ నిరాకరణ

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు కేసులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరణ. కేసు వివరాలు, తాజా పరిణామాలు తెలుసుకోండి.

Update: 2025-05-16 08:13 GMT

Kakani Govardhan Reddy: కాకాణికి సుప్రీంలో ముందస్తు బెయిల్‌ నిరాకరణ

Kakani Govardhan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) కి క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు కేసులో సుప్రీంకోర్టు పెద్ద ఎదురుదెబ్బ ఇచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ (Anticipatory Bail) ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఫిబ్రవరి నెలలో కాకాణిపై క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితర ఆరోపణలపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరారీలో ఉన్నారు. ఈ కేసు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురైన షాక్‌ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Tags:    

Similar News