Sarvepalli: గ్రామ సచివాలయ పౌర సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి

నియోజకవర్గంలో గ్రామ సచివాలయ పౌర సేవలను ప్రారంభించి, అర్జీదారులకు వివిధ రకాల సేవా పత్రాలను అందజేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

Update: 2020-01-26 14:39 GMT

సర్వేపల్లి: నియోజకవర్గంలో గ్రామ సచివాలయ పౌర సేవలను ప్రారంభించి, అర్జీదారులకు వివిధ రకాల సేవా పత్రాలను అందజేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. లబ్దిదారులకు గృహానివేశ అధీన పత్రాలను, గృహ నిర్మాణ మంజూరు పత్రాలను పంపిణీ చేసారు. మహిళలకు మంజూరు అయిన రూ.4 కోట్ల 97 లక్షల స్త్రీ నిధి చెక్కును, రూ.15కోట్ల 11లక్షల 47 వేల బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేసారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులకు అవసరమైన కంప్యూటర్లు, స్టేషనరీని ఎమ్మెల్యే పంపిణీ చేసారు. అనంతరం వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసారు. ప్రజలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్థాయిలో, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత మన జగన్ మోహన్ రెడ్డిదేనని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్ఫూర్తికి విఘాతం కలగకుండా, ఆయన ఆలోచనలకు భంగం కలగకుండా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, వాలంటీర్లను నియమించి మీ ఇంటి వద్దకే పింఛన్లు అందించే వ్యవస్థను తీసుకొని వచ్చామని తెలిపారు.

అర్హులైన ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా అందరికీ పింఛన్లు అందిస్తున్నమని, రాజ్యాంగ స్పూర్తితో జగన్ మోహన్ రెడ్డి గ్రామ స్థాయిలో ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చామని, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో ఒక అధికారి ఉన్న స్థానంలో, 12 మంది అధికారులను నియమించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదని కొనియాడారు.

Tags:    

Similar News