కబడ్డీ ఆటలో అపశ్రుతి.. ఆటలో గాయపడ్డ యువకుడు మృతి
Andhra News: చికిత్స పొందుతూ కేజీహెచ్‌లో మృతి చెందిన యువకుడు
కబడ్డీ ఆటలో అపశ్రుతి.. ఆటలో గాయపడ్డ యువకుడు మృతి
Andhra News: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం ఎరుకొండలో విషాద ఘటన జరిగింది. న్యూఇయర్ సందర్భంగా 4 గ్రామాల మధ్య కబడ్డీ పోటీలు జరిగాయి. కూతకు వచ్చిన రమణ అనే యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వెనుక ఉన్న క్రీడాకారులంతా రమణపై పడ్డారు. దీంతో రమణ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే యువకుడిని కేజీహెచ్ తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.