KA Paul: బీజేపీలో జనసేన విలీనం.. 5వేల కోట్లకు బేరం
KA Paul: నేనైతే పది లక్షల కోట్ల అప్పును ఒకే సారి తీర్చేస్తా
KA Paul: బీజేపీలో జనసేన విలీనం.. 5వేల కోట్లకు బేరం
KA Paul: జనసేనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనను బీజేపీలో విలీనం చేయాలని చిరంజీవి, పవన్ కల్యానణ్ మాట్లాడుకున్నారని ఆయన విమర్శించారు. 5 వేల కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకుని తమ పార్టీని విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీని వెనక మాస్టర్ మైండ్ అంతా అల్లు అరవింద్‌దేనన్నారు కేఏ పాల్... మనకు అన్యాయం చేసిన మోదీకి పవన్ ఓటేయమంటున్నాడని, జనసేనకు ఒక్క ఓటేసినా మోదీకి ఓటేసినట్లేనని కేఏ పాల్ అన్నారు. చిరంజీవి, పవన్ డ్యాన్సులు చేసి లక్షల కోట్ల అప్పులు తీరుస్తారా అని ప్రశ్నిస్తూ.. నేనైతే పది లక్షల కోట్ల అప్పును ఒకే సారి తీర్చేస్తానని చెప్పారు.