ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన జస్టిస్ నాగార్జునరెడ్డి

ఏపీఈఆర్‌సీ(ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్) చైర్మన్ గా జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్

Update: 2019-10-30 10:05 GMT

ఏపీఈఆర్‌సీ(ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్) చైర్మన్ గా జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. నాగార్జునరెడ్డి చేత ప్రమాణం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డిని గవర్నర్, ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు.

కాగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ నాగార్జునరెడ్డి 1956 డిసెంబర్ 5న కడప జిల్లా గడికోట గ్రామంలో జన్మించారు. 1979లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1989-1996 వరకు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. తరువాత బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఏపీ హైకోర్టు, ఓఎన్‌జీసీ తదితర సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా చాలా కాలం పనిచేశారు. 2006 సెప్టెంబర్ 11న ఏపీ ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2008లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి సాధించారు. 2018 డిసెంబర్ 4న పదవీ విరమణ చేశారు.

Tags:    

Similar News