Guntur: కరోనా వైరస్ నివారణపై అధికారులతో జేసీ వీడియో కాన్ఫరెన్స్

జిల్లాలో కరోనా (కోవిడ్ -19) వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కానప్పటికీ, అధికారులు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు సిద్దంగా వుంచుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.

Update: 2020-03-16 02:25 GMT
JC video Conference with officials about coronavirus

గుంటూరు: జిల్లాలో కరోనా (కోవిడ్ -19) వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కానప్పటికీ, అధికారులు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు సిద్దంగా వుంచుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.

 ఆదివారం సాయంత్రం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కరోనా (కోవిడ్ -19) వైరస్ నివారణ ముందస్తు చర్యలపై రెవిన్యూ డివిజన్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, తహశిల్దార్లు, యంపిడిఓలతో సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిన విదేశాల నుండి వచ్చిన వారి వివరాలను మండలాల వారీగా జిల్లా వైద్య శాఖాధికారులు పంపిణి చేసారన్నారు. వీరిని వెంటనే గుర్తించి స్థానిక వైద్య అధికారులతో పరీక్షించి హోం ఐసోలేషన్ లో వుంచాలన్నారు.

వారి వివరాలను వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారికి అందిం చాలన్నారు. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే విధానం, నివారణ చర్యలు, వైరస్ సోకిన వారికి వ్యాధి లక్షణాల గురించి మెడికల్ అధికారులతో పూర్తి స్థాయిలో అవగాహన కోసం శిక్షణ ఇవ్వాలన్నారు. వీరి ద్వారా గ్రామ, మండల, పట్టణాలలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.



Tags:    

Similar News