JC Prabhakar Reddy: జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి..

JC Prabhakar Reddy: ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసులో రేమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ. ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అవ్వగా..

Update: 2020-08-20 15:24 GMT

JC Prabhakar Reddy (File Photo)

JC Prabhakar Reddy: ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసులో రేమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ. ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అవ్వగా.. కడప సెంట్రల్ జైలు నుండి ఇవాళ విడుదలయ్యారు. ఆయనకు కరోనా సోకటంతో మెరుగైన వైద్య చిక్త్స కోసం హైదరాబాద్ రానున్నారు. కాగా తనకు కరోనా పాజిటివ్ సోకిన నేపధ్యంలో చికిత్స కోసం బెయిల్ మంజూరు చేయాలనీ కోర్ట్ లో ప్రభాకర్ రెడ్డి పిల్ దాఖలు చేయగా.. ఆరోఘ్య దృష్ట్యా న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే విదంగా ఈఎస్ఐ స్కాం వివాదంలో అరెస్ట్ అయిన అచ్చెం నాయిడుకు కుడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

ఇక పొతే రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది.. నిత్యం తొమ్మిది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 9,393 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,551 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,393 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 95 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరు జిల్లా 16, ప్రకాశం జిల్లా 11, నెల్లూరు జిల్లా 09, అనంతపురం జిల్లా 08, తూర్పు గోదావరి జిల్లా 08, పశ్చిమ గోదావరి జిల్లా 08, కడప జిల్లాలో 07, గుంటూరు జిల్లా 06, విశాఖపట్నం జిల్లా 06, కర్నూలు జిల్లా 06, శ్రీకాకుళం జిల్లా 06, విజయనగరం జిల్లా 03, కృష్ణ జిల్లా 03, కరోనా బారిన పడి మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,25,396. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,906. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా 45,356 కర్నూల్ జిల్లా 36, 381 అనంతపురం జిల్లా 32, 603 కేసులు నమోదు.

ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,35,218 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 87,177 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 55,551 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 30,74,847 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర  ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 


Tags:    

Similar News