త్వరలో జనసేన 'మన నుడి.. మన నది' కార్యక్రమం

మన భాష మూలలను మనమే నరికేసుకుంటున్నామన్నారు జనసేనాని పవన్ కల్యాణ్‌. నది లేనిదే నాగరికత.

Update: 2019-11-20 17:04 GMT
pawan kalyan

మన భాష మూలలను మనమే నరికేసుకుంటున్నామన్నారు జనసేనాని పవన్ కల్యాణ్‌. నది లేనిదే నాగరికత.. భాష లేనిదే సంస్కృతి లేవన్నారు. మాతృ భాష పరిరక్షణ.. నదుల సంరక్షణకు 'మన నుడి.. మన నది' పేరుతో.. వినూత్న కార్యక్రమం చేపట్టనున్నారు. మాతృభాష నశించాక సంస్కృతి మిగలదని, అందుకు చరిత్రలో రుజువులున్నాయన్నారు. నాగరికతకు అమ్మ ఒడి.. నుడి అని, భాష లేనిదే సంస్కృతి లేదన్నారు. 'మన నుడి.. మన నది' కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలవారు పాల్గొనాలని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు పవన్‌ కల్యాణ్‌. 



Tags:    

Similar News