Nadendla Manohar: జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు ఓ చేదు అనుభవం
*జనసేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది
Nadendla Manohar: జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు ఓ చేదు అనుభవం
Nadendla Manohar: జనసేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. గతంలో జనసేన ఆవిర్భావ వేడుకల కోసం ఏర్పాటు చేసిన సభ కోసం స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామస్థులతో భేటీ కోసం ఆయన ఆ గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామస్తులతో నాదెండ్ల మాట్లాడుతుండగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్‌ఫోన్ల లైటింగ్ లోనే నాదెండ్ల తన సమావేశాన్ని కొనసాగించారు. నాదెండ్ల ప్రసంగం ముగిసిన మరుక్షణమే గ్రామంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడం విశేషం.
ఇప్పటం గ్రామస్థులు విరాళాలతో నిర్మించుకున్న కమ్యూనిటీ హాలుకు YSR పేరు పెట్టడం ఏమిటని నాదెండ్ల ప్రశ్నించారు. పాలన చేతగాక పేర్లు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం అమ్మితే వచ్చిన సొమ్ములు కూడా కులాల వారీగా విడదీసి చూడటం దౌర్భాగ్యమన్నారు. వైసీపీ నేతలు పవన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని నాదెండ్ల విమర్శించారు.