ఆ ఘటన చాల మనస్తాపం కలిగించింది: పవన్ కళ్యాణ్

మెదక్ జిల్లాలో మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడి మరణించిన సంఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

Update: 2020-05-28 12:03 GMT
Pawan Kalyan (File Photo)

మెదక్ జిల్లాలో మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడి మరణించిన సంఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చిన్నారి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసారు. మూడేళ్ల పసివాడు సాయివర్ధన్ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి మృతి చెందడం చాలా మనస్తాపం కలిగించిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ ఘటన పాపన్నపేట మండలం పోడ్చన పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. నీళ్లు కోసం 120 అడుగులు లోతులో బుధవారమే బోరు బావి తవ్వారు.. అయితే తవ్వి నీళ్లు రావడం లేదని అలాగే వదిలేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ బోరు సమీపంలో ఆదుకోవడానికి వెళ్లిన సాయి వర్ధన్‌ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. ''మెదక్ జిల్లా బోరుబావి దుర్ఘటనలో ప్రమాదవశాత్తు పడిపోయిన మూడు ఏళ్ళు పసివాడు సాయివర్ధన్ ప్రాణాలు కోల్పోవటం, చాల మనస్తాపం కలిగించింది.ఆ పసిబిడ్డ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, బిడ్డ తల్లి తండ్రులకు,మిగతా కుటుంబసభ్యులకు నా సంతాపాన్ని తెలియచేస్తున్నాను...'' అని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వార త్వీట్ చేసారు. సాయివర్ధన్ తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నట్టు తెలిపారు.


సుమారు 25 అడుగుల లోతులో బాలుడు ఉండొచ్చని భావించిన అధికారులు.. బోరు బావికి సమాంతరంగా మరో గొయ్య తవ్వి బరుడిని బయటకు తీసారు. కానీ.. అప్పటికే బాలుడిపై మట్టి పెల్లలు పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పాపన్నపేట మండలం పోడ్చన పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 


Tags:    

Similar News