జనాలు తీరుపై జనసేనాని అసంతృప్తి

కరోనా వైరస్ వలన ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. క్రమక్రమంగా ఈ వైరస్ ప్రభావం ఎక్కువ కావడంతో చాలా మంది చనిపోతున్నారు.

Update: 2020-03-23 14:30 GMT
Pawan Kalyan(file photo)

కరోనా వైరస్ వలన ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. క్రమక్రమంగా ఈ వైరస్ ప్రభావం ఎక్కువ కావడంతో చాలా మంది చనిపోతున్నారు. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలానే శ్రమిస్తున్నాయి. అందులో భాగంగానే నిన్న (ఆదివారం) భారత ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. అంతేకాకుండా కేంద్రం దేశ వ్యాప్తంగా 75జిల్లాలో లాక్ డౌన్ నీ ప్రకటించింది.

లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కొందరు వినిపించుకోకుండా వచ్చేస్తున్నారు. పోలీసుల హెచ్చరిస్తునప్పటికీ అవన్నీ పట్టించుకోవడం లేదు. అయితే జనాలు తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ..."చాలామంది ఇప్పటికే లాక్ డౌన్ ను తీవ్రంగా పరిగణించడం లేదు. దయచేసి ఇ మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ కుటుంబాన్ని రక్షించండి. సూచలను ఖచ్చితంగా పాటించండి. నియమాలు, చట్టాలను అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను" అని అన్నారు.

దీనికి ముందు మరో ట్వీట్ లో " ప్రధాని మాట పాటిద్దాం,కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం... మనలని మనం రక్షించుకుందాం... దయచేసి అందరు కరోనా వ్యాధి తీవ్రతని గుర్తించాలి,లాక్ డౌన్ ని విధిగా పాటించాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలందరూ చేత పాటించేలా చర్యలు తీసుకోవాలి." అని అన్నారు.

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య 390కి చేరుకుంది. కాగా మొత్తం ఏడుగురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణారాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 33కి చేరిందని మంత్రి ఈటెల ప్రకటించారు. మరో 97 మంది అనుమానితులు ఉన్నారని వెల్లడించారు. ఇక పీలో ఏడూ కేసులు నమోదు అయ్యాయి.




Tags:    

Similar News