Pawan Kalyan: పులివెందుల రౌడీయిజం చేస్తే.. మేము చూస్తూ ఊరుకోం
Pawan Kalyan: ఎవరు అనుమానంగా ఉన్నా వారిని పట్టుకోండి
Pawan Kalyan: పులివెందుల రౌడీయిజం చేస్తే.. మేము చూస్తూ ఊరుకోం
Pawan Kalyan: జనసేన అధినేతపవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అన్నారు పవన్. సభను అడ్డుకునేందుకు క్రిమినల్స్‌ను దింపారనే సమాచారం ఉందన్నారు. పబ్లిక్ మీటింగ్‌లో రాళ్ళ దాడి చేసి గొడవ చేయాలని కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్ చేశారు పవన్. పెడన సభలో గొడవలు సృష్టిస్తే తాము సహించని, జరిగే పరిణామాలకు సీఎం, డీజీపీ బాధ్యత వహించాలన్నారు పవన్. టీడీపీ, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారని, పులివెందుల రౌడీయిజం చేస్తే.. మేము చూస్తూ ఊరుకోమన్నారు పవన్. జగన్ ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే.. భవిష్యత్ లో చాలా దారుణంగా ఉంటుంది గుర్తు పెట్టుకో అని పవన్ హెచ్చరించారు.