Janasena Chief Pawan Kalyan About Disha Act: దిశ చట్టం... ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఏమయ్యాయి : జనసేనాని

Janasena Chief Pawan Kalyan About Disha Act: తూర్పు గోదావరి జిల్లాలో కోరుకొండ మండలానికి చెందిన ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటన పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

Update: 2020-07-20 10:28 GMT
Pawan Kalyan (File Photo)

Janasena Chief Pawan Kalyan About Disha Act: తూర్పు గోదావరి జిల్లాలో కోరుకొండ మండలానికి చెందిన ఓ బాలికపై సామూహిక అత్యాచార ఘటన పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనని విడుదల చేశారు. రాజమహేంద్రవరంలో కుటుంబ పోషణ కోసం ఓ దుకాణంలో పని చేస్తున్న 16ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారనే వార్త తీవ్రంగా కలచివేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అమానుషకరమైన ఈ ఘటన హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని, నాలుగు రోజులపాటు చిత్ర హింసలకు గురి చేసిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలని పవన్ పేర్కొన్నారు.

తన కుమార్తె ఆచూకీ తెలియడం లేదని తల్లి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసిన సకాలంలో స్పందించలేదని తెలిసింది. మహిళలపై అత్యాచారాలు నిరోధానికి తీసుకువచ్చిన దిశ చట్టం ఏమైపోయింది? అసెంబ్లీలో ముక్తకంఠంతో ఆమోదం పొందిన ఆ చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదు? తొలి దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటైన రాజమహేంద్రవరంలోనేసామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకొంది. దిశ పేరుతో ఏర్పాటైన ఆ ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఏం చేస్తున్నాయని పవన్ ప్రశ్నించారు.

ఈ సామూహిక అత్యాచారం వెనక గంజాయి, డ్రగ్స్‌ ముఠాలు ఉన్నాయని ఇది ట్లేడ్‌ బ్యాచ్‌ పనే అని ఆ నగరవాసులు ఆందోళన చెందుతున్న విషయాన్ని పోలీస్‌ అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని, అలాంటి ముఠాల ఆగడాలకు, కళ్ళెం వేయకపోతే రక్షణ కరవవుతుంది. చట్టం చేయడం కాదు.. వాటిని నిబద్ధతతో అమలు చేస్తేనే మహిళలకు రక్షణ కలుగుతుందని పవన్ పేర్కొన్నారు.


Tags:    

Similar News