స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనసేనాని కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది. నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అన్ని కూడా ఎన్నికలకు సిద్ధమైయ్యాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు వ్యూహాలను పదును పెడతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు జనసేన పార్టీ కూడా సిద్దమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికతో పాటూ.. ప్రచారంలోనూ నిమగ్నమయ్యాయి. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికలకు జిల్లాలవారీగా సమన్వయకర్తల నియమించారు. నామినేషన్ దశ నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అన్ని కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటారు. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో 13 జిల్లాలకు సమన్వయకర్తల వివరాలు వెల్లడించింది.
చిత్తూరు ( బొలిశెట్టి సత్య), కడప ( డా.పి.హరిప్రసాద్), కర్నూలు ( టి.సి.వరుణ్), అనంతపురం ( చిలకం మధుసూదన్ రెడ్డి), కృష్ణా జిల్లా ( పోతిన మహేశ్),గుంటూరు( వత్త కళ్యాణం శివ శ్రీనివాస్ ), ప్రకాశం (ఉషేక్ రియాజ్), నెల్లూరు (సి.మనుక్రాంత్ రెడ్డి), శ్రీకాకుళం జిల్లా ( డాక్టర్ బి.రఘు), విజయనగరం జిల్లా (గడసాల అప్పారావు ), విశాఖపట్నం (రూరల్) (సుందరపు విజయ్ కుమార్), తూర్పుగోదావరి జిల్లా (బొమ్మదేవర శ్రీధర్ (బన్ను) పశ్చిమ గోదావరి జిల్లా ( ముత్తా శశిధర్) సమన్వయకర్తలుగా నియమించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలవారీగా జనసేన సమన్వయకర్తల నియామకం pic.twitter.com/I0qpaLAjHP
— JanaSena Party (@JanaSenaParty) March 8, 2020