పవన్ పర్యటనలకు ముందే గుంతల పూడ్చివేత.. శ్రమదానానికి ఛాన్స్ లేకుండా..
Shramadanam: జనసేనాని రేపటి శ్రమదానం కార్యక్రమంపై అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతుంది.
పవన్ పర్యటనలకు ముందే గుంతల పూడ్చివేత.. శ్రమదానానికి ఛాన్స్ లేకుండా..
Shramadanam: జనసేనాని రేపటి శ్రమదానం కార్యక్రమంపై అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతుంది. జనసేన అధినేత శ్రమదానం కార్యక్రమానికి ప్రకటించిన ప్రతి రోడ్డులోనూ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేస్తున్నారు. తాజాగా రాజమండ్రి బాలాజీపేట బొమ్మూరు రోడ్డు దగ్గర శ్రమదానం చేసి మరమ్మత్తులు చేస్తామని జనసేనాని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.
ఇప్పటికే జనసేన ప్రకటించిన అనంతపురం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌లపై మరమ్మత్తులు చేసిన ఆర్&బీ అధికారులు తాజాగా రాజమండ్రి బాలాజీపేట బొమ్మూరు రోడ్డు మరమ్మత్తులను హుటాహుటిన చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపటి జనసేన శ్రమదానం కార్యక్రమంపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది.