Pawan Kalyan: ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు...

Pawan Kalyan: 10 గ్రేస్ మార్కులు ఇవ్వాలని డిమాండ్..రీ కౌంటింగ్‌ను ఉచితంగా చేపట్టాలి

Update: 2022-06-08 09:04 GMT

Pawan Kalyan: ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు

Pawan Kalyan: ఏపీలో విడుదలైన పదో తరగతి ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఫెయిల్ కావడానికి వారి తల్లిదండ్రులే కారణమంటూ నెపం వేస్తారా? అని పవన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన పవన్ పలు డిమాండ్లను వినిపించారు.

10 గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉచితంగా రీ కౌంటింగ్ నిర్వహించాలని ఆయన కోరారు. రీ కౌంటింగ్ కు ఎలాంటి ఫీజు వసూలు చేయరాదన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు వసూలు చేయరాదని పవన్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News