Pavan Kalyan:వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపాటు
Pavan Kalyan: విశాఖలో వైసీపీ నిరసనలు ఎన్నికల స్టంట్ -పవన్ * విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే..
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)
Pavan Kalyan: విశాఖలో వైసీపీ నిరసనలు ఎన్నికల స్టంట్ అని విమర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీకి.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే పార్లమెంట్ సాక్షిగా నిరూపించుకోవాలని సూచించారు. ఢిల్లీలో పెద్దలతో మాట్లాడేందుకు వైసీపీ భయపడుతోందని పవన్ ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి.. వినతి పత్రం అందజేశామని, ప్రైవేటీకరణపై ఒకసారి పునరాలోచించుకోవాలని కోరామని అన్నారు జనసేనాని.