Tirupati: తిరుపతి జిల్లాలో జల్లికట్టు వేడుకలు
Tirupati: జల్లికట్టు సంబరాల్లో గాయపడిన యువకులు
Tirupati: తిరుపతి జిల్లాలో జల్లికట్టు వేడుకలు
Tirupati: తిరుపతి జిల్లాలో సంక్రాంతి పండగకు ముందే జల్లికట్టు హడావుడి మొదలైంది. చంద్రగిరి మండలం కొత్త శానంబట్లలో జల్లికట్టు వేడుకలు నిర్వహిస్తున్నారు. పరిసరాల్లోని 36 గ్రామాల నుంచి యువకులు జల్లికట్టు సంబరాల్లో భాగస్వామ్యమయ్యారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యువత హాజరై కోడెగిత్తలకు కట్టిన బహుమతులను సొంతం చేసుకునేందుకు ఉత్సాహం చూపించారు. ఈ జల్లికట్టులో 100కు పైగా ఎడ్ల జతలు రాగా ముప్పైకి పైగా జల్లికట్టులో కోడెగిత్తలు పాలుపంచుకున్నాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించినా, ఇక్కడ జల్లికట్టును కొనసాగిస్తున్నారు. జల్లికట్టు సంబరాల్లో కోడె గిత్తలను పట్టుకునే ప్రయత్నించిన యువకులు చాలామంది గాయపడ్డారు.