ఏపీలో నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం
ఇవాళ్టి నుంచి గ్రామాల్లో మొదలుకానున్న వైద్య శిబిరాలు
ఏపీలో నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం
AP: ఏపీలో నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు మొదలు కానున్నాయి. రేపటి నుంచి పట్టణాలు, నగరాల్లో ఈ శిబిరాలు ప్రారంభమవుతాయి. మొత్తం ఆరు నెలల్లో 13 వేల 954 శిబిరాలను నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి శిబిరానికి ముగ్గురు వైద్యులను పంపి వారితో పరీక్షలు చేయించి జబ్బులకు సంబంధించి ప్రిస్కిప్షన్ అందచేయనున్నారు. సంక్రాంతికి ముందే ఈ శిబిరాలను ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ శిబిరాల ద్వారా గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లి వైద్యసేవలను అందించనున్నారు. మొత్తం అరవై లక్షల మందికి వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య శిబిరాలకు రావాలని సూచిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో మొత్తం ఏడు రకాల మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని అక్కడికక్కడే సూచించనున్నారు.