Gudivada Amarnath: పోలీసులు సెక్యూరిటీ కల్పించకున్నా.. మా కార్యకర్తలే జగన్‌కు సెక్యూరిటీగా ఉంటారు

Gudivada Amarnath: మాజీ సీఎం జగన్‌ రేపు విశాఖలో పర్యటించి.. మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు.

Update: 2025-10-08 10:47 GMT

Gudivada Amarnath: మాజీ సీఎం జగన్‌ రేపు విశాఖలో పర్యటించి.. మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అయితే.. రోడ్డు మార్గంలో వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. మెడికల్ కాలేజీని సందర్శించడానికి జగన్ రోడ్డు మార్గంలోనే వస్తారని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం జగన్‌కి సెక్యూరిటీ కల్పించకపోయినా.. తమ వైసీపీ కార్యకర్తలే సెక్యూరిటీగా నిలబడతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News