Sajjala Ramakrishna: రాజశేఖర్ వారసుడిగా జగన్ ప్రజల మన్ననలు పొందుతున్నారు

Sajjala Ramakrishna: వైఎస్ ఆశయాలను, లక్ష్యాలను నెరవేరుస్తున్నారు

Update: 2023-07-08 08:47 GMT

Sajjala Ramakrishna: రాజశేఖర్ వారసుడిగా జగన్ ప్రజల మన్ననలు పొందుతున్నారు

Sajjala Ramakrishna Reddy: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి... వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే ఆయన తనయుడు వైఎస్ జగన్ నడుస్తున్నారని పేర్కొన్నారాయన... వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్ ప్రజల మన్ననలు పొందారని, వైఎస్ఆర్ ఆశయాలను, లక్ష్యాలను నెరవేరుస్తున్నారని సజ్జల కొనియాడారు. వైఎస్ఆర్ లా ప్రజల హృదయాల్లో నిలిచేలా జగన్ పరిపాలన అందిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్‌ఆర్ మరణించినా ఆయన పాలన ఆగలేదంటే.. అది జగన్ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రతి కార్యకర్త తాము జగనన్న మనుషులమని గర్వంగా చెప్పుకొనేలా జగన్ పాలన జరుగుతోందని చెప్పిన సజ్జల, ఏపీని అన్నింటా అగ్రగామిగా నిలిపేలా జగన్ అడగులు వేస్తున్నారని ప్రశంసించారు...

Tags:    

Similar News