ఇవాళ హైదరాబాద్‌కు ఏపీ సీఎం.. కేసీఆర్‌ను కలవనున్న జగన్
Jagan: ఉ.10 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్న జగన్
ఇవాళ హైదరాబాద్‌కు ఏపీ సీఎం.. కేసీఆర్‌ను కలవనున్న జగన్
Jagan: ఇవాళ హైదరాబాద్‌లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన కలవనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు సీఎం జగన్. అనంతరం.. బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను జగన్ కలిసి పరామర్శించనున్నారు.
కేసీఆర్ ఇటీవలే తన ఫామ్‌హౌస్‌లో జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. దీంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు వైద్యులు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్.. గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్.. కేసీఆర్‌ను పరామర్శించనున్నట్టు తెలుస్తోంది.