Jagan: గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం
Jagan: ఇకపై ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహిస్తాం
Jagan: గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం
Jagan: గుంటూరు జిల్లాలో సీఎం జగన్ ఆడుదాం ఆంధ్రా పోటీలను ప్రారంభించారు. స్పోర్ట్స్ కిట్లను సీఎం పరిశీలించారు. ఇది అందరూ పాల్గొనే గొప్ప పండగ అని.. 47 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అని.. ఆరోగ్యం సరిగా ఉండాలంటే జీవితంలో క్రీడలు అవసరమన్నారు. క్రీడల వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. మంచి ఆరోగ్యానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్న జగన్... గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.