CM Jagan: జనవరి 2023 నుంచి పెన్షన్ రూ.2,750కు పెంచుతున్నాం
CM Jagan: రూ.3 వేల వరకు పెంచుతామన్న హామీని కూడా నెరవేరుస్తాం
CM Jagan: జనవరి 2023 నుంచి పెన్షన్ రూ.2,750కు పెంచుతున్నాం
CM Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్.. ఏపీ ప్రజలకు వరాలు ప్రకటించారు. జనవరి నుంచి పెన్షన్ పెంచుతామని ప్రకటించారు. ఏపీలో ప్రస్తుతం వృద్దులు, వితంతువులకు 2 వేల 500 రూపాయల పెన్షన్ వస్తోంది. సీఎం జగన్ తాజా ప్రకటనతో జనవరి నుంచి పెన్షన్ 2 వేల 750 రూపాయలు ఇవ్వనున్నారు. ప్రతి ఏటా పెన్షన్‌ను 250 రూపాయలు పెంచుతామని ఎన్నికల హామీ ఇచ్చారు జగన్. అందులో భాగంగానే రెండు విడతలుగా పెంచారు. వచ్చే జనవరి నుంచి మూడో విడతగా మరో 250 రూపాయలు పెంచుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు.