Andhra Pradesh: మేయర్, ఛైర్మన్ అభ్యర్ధుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు

Andhra Pradesh: కార్పొరేషన్ మేయర్ అండ్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

Update: 2021-03-15 10:56 GMT

ఫైల్ ఇమేజ్ 

Andhra Pradesh: కార్పొరేషన్ మేయర్ అండ్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పలువురు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన సీఎం జగన్‌ మేయర్, మున్సిపల్ ఛైర్మన్‌ అభ్యర్ధుల ఎంపికపై చర్చిస్తున్నారు. ఇప్పటికే తుది కసరత్తు పూర్తయింది. అయితే, మేయర్ అండ్ ఛైర్మన్ అభ్యర్ధుల్లో బీసీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక, మేయర్ అభ్యర్ధులుగా పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. విశాఖ మేయర్ అభ్యర్ధిగా వంశీకృష్ణ శ్రీనివాస్‌ అలాగే, విజయవాడ మేయర్ అభ్యర్ధిగా రాయన భాగ్యలక్ష్మి గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే, తిరుపతి మేయర్ అభ్యర్ధిగా శిరీష కర్నూలు మేయర్ అభ్యర్ధిగా బీవై రామయ్య కడప మేయర్ అభ్యర్ధిగా కె.సురేష్‌బాబు ఒంగోలు మేయర్‌గా సుజాత పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇప్పటికే తుది కసరత్తు పూర్తి కావడంతో మరికాసేపట్లోనే మేయర్ అండ్ ఛైర్మన్ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఇక, మున్సిపోల్స్‌లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించడంతో పలువురు మంత్రులు, ముఖ్యనేతలు సీఎం జగన్‌ను కలిసి అభినందనలు తెలుపుతున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా తదితరులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. జగన్ సుపరిపాలన, ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఇంతటి ఘనవిజయం సాధ‌్యమైందని అన్నారు.

Tags:    

Similar News