YSR Law Nestham: వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన జగన్
YSR Law Nestham: జూ.న్యాయవాదుల ఖాతాల్లో రూ. 25వేలు జమచేయనున్న జగన్
YSR Law Nestham: వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన జగన్
YSR Law Nestham: వైఎస్సార్ లా నేస్తం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు 5 వేల స్టైఫండ్ వేయనున్నారు. అందులో బాగంగానే మొదటివిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ 5 నెలల వరకూ ప్రతీ యువ న్యాయవాదికి ఖాతాలో 25 వేల చొప్పున మొత్తం 6,12,65,000 విడుదల చేశారు.
ప్రభుత్వం కొత్తగా లా పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి 60 వేలు ఆర్థిక సాయం చేయనుంది. రెండు దఫాల్లో ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయ వాదులకు లబ్ది చేకురింది. అందుకోసం 41.52 కోట్లును విడుదల చేసింది.