Jagan: 175 దిశగా పావులు కదుపుతోన్న సీఎం జగన్
Jagan: మిగిలిన 139లో 50 సీట్ల వరకు బీసీలకు ఇచ్చేలా కసరత్తు
Jagan: 175 దిశగా పావులు కదుపుతోన్న సీఎం జగన్
Jagan: తనతో సన్నిహితంగా ఉండటం కాదు.. ప్రజలతో సన్నిహితంగా ఉన్నవాళ్లకే టికెట్లు అంటున్నారు సీఎం జగన్. ప్రజాధరణ లేని ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి టికెట్లు ఇచ్చేదే లేదంటూ తేల్చి చెప్పేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే టికెట్లు ఇస్తామని ఇప్పటికే పలు మార్లు చెప్పిన జగన్.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. లెక్క ఎక్కువైనా పర్లేదు గాని తక్కువ కాకుండా ఉండేలా 175నే టార్గెట్‌గా పెట్టుకోవాలని నేతలకు సూచిస్తున్నారు.
క్షేత్ర స్థాయి సర్వేల ఆధారంగా... ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ 3 నుంచి 4స్థానాల్లో మార్పులు ఉంటాయన్న టాక్ నడుస్తోంది. గెలుపు గుర్రాల వైపే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే వారి ప్లేస్‌లో 15 మంది ఎంపీలను రీప్లేస్ చేసే ప్లాన్‌లో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇచ్చే ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీలో కష్టపడుతున్న వారిని గుర్తించాలని నిర్ణంచిన జగన్.. 38 మందికి పైగా కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని తెలుస్తోంది.