Jagan: దత్తపుత్రుడికి ఏపీలో శాశ్వత అడ్రస్ కూడా లేదు

Jagan: పక్క వ్యక్తి సీఎం కావాలని పార్టీ పెట్టిన వ్యక్తి దేశ చరిత్రలో ఎవరూ లేరు

Update: 2023-12-29 07:51 GMT

Jagan: దత్తపుత్రుడికి ఏపీలో శాశ్వత అడ్రస్ కూడా లేదు

Jagan: ఏపీ సీఎం జగన్ భీమవరం సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భీమవరం ప్రజలు ఓడించిన దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఉంటాడని.. ఏపీలో అడ్రస్ లేదని అన్నారు. పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ.. పక్క వ్యక్తి సీఎం కావాలని పార్టీ పెట్టిన వ్యక్తి దేశ చరిత్రలో ఎవరూ లేరని సెటైర్లు వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలు.. అదే తనకు వందల కోట్లు అనుకునే వ్యక్తి పవన్‌కల్యాణ్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్. ప్రజల కోసం త్యాగాలు చేసే వారిని చూశాం కానీ.. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఇప్పుడు చూస్తున్నామని అన్నారు.

Tags:    

Similar News