Jagan: 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ప్రజలకు ఏం చేశాడు

Jagan: వాళ్లు బాగుపడడం కోసమే అధికారాన్ని ఉపయోగించారు

Update: 2023-12-29 08:51 GMT

Jagan: 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ప్రజలకు ఏం చేశాడు

Jagan: చంద్రబాబు ప్రజల మనస్సుల్లో లేరని, వారికి విశ్వసనీయత లేదని అన్నారు సీఎం జగన్. రెండు విషాలు కలిస్తే అమృతం తయారవుతుందా అని జగన్ ప్రశ్నించారు. కూతురునిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ చంద్రబాబుది అంటూ జగన్ ఆరోపణలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కుటిల నీతిని ప్రజలు ఎండగట్టాలని జగన్ పిలుపునిచ్చారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏదైనా మంచి పనిని గుర్తుపెట్టుకోగలరా అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ఓటేస్తారా అంటూ జగన్ అడిగారు. గత పాలనలో దోచుకున్నది దాచుకోవడానికే అధికారాన్ని ఉపయోగించారని జగన్ ఆరోపించారు. వెన్నుపోట్లు పొడిచే వీళ్ల రాజకీయం అందరికీ తెలుసునని అన్నారు.

Tags:    

Similar News