బోటు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ ఏరియల్ వ్యూ

బోటు ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని, ప్రమాదం పై కొనసాగుతున్న సహాయక చర్యలను విహంగ వీక్షణం ద్వారా సీఎం ఈరోజు పరిశీలించారు. రాజమండ్రిలోని ఆస్పత్రిలో బోటు ప్రమాద బాధితులను జగన్ పరామర్శించారు.

Update: 2019-09-16 06:37 GMT

తూర్పుగోదావరి రాజమండ్రిలోని ఆస్పత్రిలో బోటు ప్రమాద బాధితులను జగన్ పరామర్శించారు. బోటు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అంతకముందు కచ్చులూరలో బోటు ప్రమాదస్థలిలో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బోటు ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని సహాయక చర్యలను విహంగ వీక్షణం ద్వారా సీఎం పరిశీలించారు. సీఎం జగన్ వెంట హోం మంత్రి సుచరిత, మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ కూడా ఉన్నారు.

Tags:    

Similar News