Jabardasth Hari: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్.. హరి కోసం గాలిస్తున్న పోలీసులు
Jabardasth Comedian Hari: జబర్దస్త్ కమెడియన్ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నారు.
Jabardasth Hari: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్.. హరి కోసం గాలిస్తున్న పోలీసులు
Jabardasth Comedian Hari: జబర్దస్త్ కమెడియన్ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నారు. చిత్తూరు జిల్లా మొరంపల్లిలో కమెడియన్ హరి ముఠాకు చెందిన ఓ స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎర్రచందనం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 60 లక్షల విలువైన 19 ఎర్రచందనం దుంగలు సీజ్ చేసిన పోలీసులు.. రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు స్మగ్లర్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పట్టుబడ్డ స్మగ్లర్ హరి ముఠాకు చెందినట్లుగా గుర్తించిన పోలీసులు.. హరి కోసం గాలిస్తున్నారు.