ISRO: నింగిలోకి దూసుకెళ్లిన SSLV D2.. ప్రయోగం విజయవంతం..
ISRO: శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన SSLV D2.. ప్రయోగం విజయవంతం..
ISRO: శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 ప్రయోగం విజయవంతమైంది. ఇవాళ తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమవగా... ఉదయం 9.18గంటకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2(స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్-డీ2) నింగిలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రయోగం 15 నిమిషాల్లోపే పూర్తయింది. ఇస్రోకు చెందిన 156.3కిలోల బరువు కలిగిన ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు అమెరికా అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ విజయంతో భారత్ కొత్త రికార్డు నెలకొల్పింది. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిన దేశంగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.