ఆప్కోలో జరిగిన అక్రమాలపై ఏపీ హైకోర్టులో విచారణ
AP High Court: గత ప్రభుత్వంలో రూ. 2 వేల కోట్ల అక్రమాలు జరిగాయని పిటిషన్
ఆప్కోలో జరిగిన అక్రమాలపై ఏపీ హైకోర్టులో విచారణ
AP High Court: ఆప్కోలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయాలనే పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గత ప్రభుత్వం హాయంలో ఆప్కోలో గుజ్జల శ్రీను హయాంలో 2వేల కోట్లు అక్రమాలు జరిగాయని పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారించింది. అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ తరపు న్యాయవాది పొలిశెట్టి రాధాకృష్ణ కోరారు. గతంలో కౌంటర్ దాఖలుకు రెండు వారాలు సమయం కోరినా కౌంటర్ వేయలేదని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జుల శ్రీనును ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.