Intermediate Colleges Re Opens in Andhra Pradesh: ఏపీలో జూనియర్ కాలేజీలు ఎప్పటినుంచి తెరుస్తారంటే..

Intermediate Colleges Re Opens in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ కాలేజీ లను ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

Update: 2020-07-13 04:30 GMT
Representational image

Intermediate Colleges Re Opens in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ కాలేజీ లను ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆగస్టు 3 నుంచి కాలేజీ లను ప్రారంభించాలని, మొత్తం 196 పనిదినాలు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు 2021 అకడమిక్ క్యాలెండర్ ను సిద్ధం చేసిన ఉన్నత విద్యా శాఖ, సీబీఎస్ఈ తరహా లో పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని పేర్కొంది.

ఇక ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహించాలని, రెండో శనివారం కూడా కాలేజీ లను నడిపించాలని, పండగల సందర్భంగా ఒకటి లేదా రెండు రోజుల సెలవు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. విద్యార్థులకు యూనిట్ పరీక్షలు నిర్వహించాలని, ఆన్ లైన్ పాఠాల నిమిత్తం వీడియో లను రూపొందించి విడుదల చేస్తామని వెల్లడించింది. యధావిధిగా మార్చి లోనే వార్షిక పరీక్షలు ఉంటాయని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఇక ప్రతి సబ్జెక్టు కూ ఒక వర్క్ బుక్ ను ప్రత్యేకంగా ఇవ్వనున్నామని, జేఈఈ మెయిన్ తదితర ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా ఈ వర్క్ బుక్ ఉంటుందని తెలియజేసింది.



Tags:    

Similar News