పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు ఎవరిఫోన్లు వారి చేతికే... ఏలూరు జిల్లా పోలీసుల వినూత్న ఆలోచన

* సెల్‌ఫోన్ల రికవరీకి ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు.. 25 లక్షల రూపాయల విలువజేసే 152 ఖరీదైన సెల్ ఫోన్ల రికవరీ

Update: 2022-11-27 02:20 GMT

ఏలూరు జిల్లా పోలీసుల వినూత్న ఆలోచన

Eluru: తెలిసీ తెలియక విలువైన యాండ్రాయిడ్ సెల్‌ఫోన్లను పోగొట్టుకున్నవారికి ఏలూరు జిల్లా పోలీసులు శుభవార్త అందించారు. తెలియకుండా పోగొట్టుకున్న ఫోన్లు, బస్సుల్లోనూ, రైళ్లల్లోనూ దొంగిలించబడిన సెల్‌ఫోన్లను వినియోగదార్లచేతికే అందివ్వాలని నిర్ణయించారు. భీమవరం పోలీసులకు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగాని ప్రత్యేక సెల్‌‎ఫోన్‌ నంబరుతో ట్రాకింగ్ టీమ్‌‌ను నియమించారు.

ఈ విభాగం ద్వారా వినియోగదారులు పోగొట్టకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. 25 లక్షల రూపాయల విలువజేసే 152 ఖరీదైన సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఆయా వినియోగదార్లకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇటీవల సెల్‌ ఫోన్లు పోగొట్టుకున్న వినియోగదార్లనుంచి ఫిర్యాదులు ఎక్కువకావడంతో ప్రత్యేక దృష్టిసారించామని ఏలూరు జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో రికవరీ చేసిన ఫోన్లను ప్రదర్శించారు. ఖరీదైన సెల్‌ ఫోన్లు తక్కువ ధరకు వస్తున్నాయని ఎవ్వరూ కొనుగోలు చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. ఎవరికైనా ఫోన్లు దొరికితే సమీప పోలీస్‌స్టేషన్లలో అప్పగించాలని సూచించారు.

Tags:    

Similar News