Weather Report: దక్షిణాదిపై బలంగా ద్రోణి.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం.. అక్కడ వర్షాలు
Weather Report: ఆగ్నేయ, నైరుతీ బంగాళాఖాతంలో బలమైన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో మోస్తరు వర్షాలకు పడుతున్నాయి. నేడు కూడా అక్కడ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే ద్రోణిమేఘాలు, ఏపీలోని రాయలసీమకు కూడా వస్తున్నాయి. దీంతో నేడు రాయలసీమలో మేఘాల వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఏపీ, తెలంగాణ నేడు వర్షాలు కురిసే అవకాశం మాత్రం లేదు.
శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం నేడు రెండు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతుంటాయి. తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా మేఘాలుంటాయి. తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాకాతంలో గాలుల వేగం గంటకు 35కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 12కిలోమీటర్లు , తెలంగాణలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ప్రయాణాలు చేసేవారికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత పగటివేళ తెలంగాణలో 29 డిగ్రీల సెల్సియస్ ఉంటే..ఏపీలో 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. రాత్రివేళ తెలంగాణలో 18 డిగ్రీల సెల్సియస్ ఉంటే..ఏపీలో 20 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతుంది. ఉత్తర తెలంగాణలో ఏజన్సీ ప్రాంతాల్లో చలి మరింత పెరుగుతుంది.
తేమ పగటిపూట తెలంగాణలో 40శాతం ఉంటే..ఏపీలో 50శాతం ఉంటుంది. రాత్రివేళ తెలంగాణలో 80శాతం ఉంటే ఏపీలో 95శాతం ఉంటుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రాత్రివేళ మంచు ఎక్కువగా కురుస్తుంది.