ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు

కరోనా నియంత్రణ చర్యల కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, చిన్న తరహా కంపెనీల నుంచి భారీ పరిశ్రమల వరకు విరాళాలు అందజేస్తున్నారు.

Update: 2020-04-02 10:12 GMT
YSJagan

కరోనా నియంత్రణ చర్యల కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, చిన్న తరహా కంపెనీల నుంచి భారీ పరిశ్రమల వరకు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖల నుంచి సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందాయి. మొత్తం రూ. 200.11 కోట్ల విరాళం అందినట్టు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ డబ్బును ఆయన చెక్కుల రూపంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి   వైఎస్ జగన్  కి అందజేశారు.

ఇందులో జిల్లా మైనింగ్ ఫండ్ నుంచి రూ. 187 కోట్లు, ఏపీఎండీసీ నుంచి రూ. 10.62 కోట్లు, మైన్స్ అండ్ జియాలజీ శాఖకు చెందిన ఉద్యోగుల విరాళం రూ. 56 లక్షలు, ఉపాధి హామీ, వాటర్ షెడ్ శాఖ ఉద్యోగుల విరాళం రూ. 1.50 కోట్లు, సెర్ప్ ఉద్యోగుల విరాళం రూ. 50 లక్షలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్ గోపాల్, సెర్ఫ్ సిఇఓ రాజబాబు, ఎపిఎండిసి మదుసూదన్ రెడ్డి, డిజిఎం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News