తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

Tirumala: నిండిన వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం

Update: 2022-10-24 02:55 GMT

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం 

Tirumala: దీపావళి సందర్భంగా ఏడు కొండలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండి భక్తులు వెలుపల క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 80వేల 565 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 31వేల 405 మంది భక్తులు సర్వదర్శనం చేసుకున్నారు. 31వేల 608 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

Tags:    

Similar News