Nellore: నెల్లూరు జిల్లా కొవ్వూరులో భారీ పేలుడు

Nellore: పేలుడు ధాటికి విరిగిపడ్డ విద్యుత్ సబ్‌ స్టేషన్ స్తంభాలు

Update: 2021-11-25 01:34 GMT
కోవూరు లో భారీ బ్లాస్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Nellore: నెల్లూరు జిల్లా కోవూరులో పేలుడు శబ్దం కలకలం రేపింది. పట్టణ వాసులను కలవరపాటుకు గురిచేసింది. భూ కంపాన్ని తలపిస్తూ భారీ శబ్ధంతో కోవూరు పట్టణం దద్దరిల్లిపోయింది. సుమారు పది కిలోమీటర్ల దూరంలో పేలుడు శబ్దం వినిపించింది. పట్టణంలోని ఓ స్మశాన వాటిక సమీపాన పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ స్తంభాలు విరిగి పడ్డాయి. ఆ పక్కనే ఉన్న బహుళ అంతస్తుల భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. కోవూరులో కొన్ని నిమిషాల పాటు స్థానికులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పేలుడు ధాటికి దట్టమైన పొగలు వ్యాపించాయి.

పేలుడు సంభవించిన చోట పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పేలుడు ఘటన వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పేలుడు ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ పరిశీలన చేస్తున్నారు. సమీప ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని లోపలకి అనుమతించడం లేదు.

Tags:    

Similar News