అమరావతికి నిధులు ఎలా సమీకరిస్తారంటే?

అమరావతిలో 70 శాతంవిలువైన రూ. 37వేల కోట్ల విలువైన పనులకు సీఆర్‌డీఏ మంగళవారం ఆమోదం తెలిపింది.

Update: 2025-03-11 13:16 GMT

అమరావతికి నిధులు ఎలా సమీకరిస్తారంటే?

అమరావతిలో 70 శాతంవిలువైన రూ. 37వేల కోట్ల విలువైన పనులకు సీఆర్‌డీఏ మంగళవారం ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఏ 45వ అథారిటీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. నిర్మాణ పనులు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు అగ్రిమెంట్ పత్రాలు అందించనున్నారు.

అమరావతిని 2028 నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణం కోసం రూ. 64, 721 కోట్లు అవసరమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

అమరావతిలో వేగంగా నిర్మాణాలు

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన సమయంలో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇచ్చారు. 2019లో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. దీంతో అమరావతిలో పనులు నిలిచిపోయాయి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల్లో వేగం పెంచాలని నిర్ణయం తీసుకుంది.

రాజధానిలో 131 సంస్థలకు 1277 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. 31 సంస్థలకు 630 ఎకరాలు ఇచ్చారు. రెండు సంస్థలకు సంబంధించి లొకేషన్ ను మార్చారు. అంతేకాదు 13 సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేశారు. రోడ్ల నిర్మాణానికి, గ్రావిటీ కెనాల్ నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. అమరావతిలో మొత్తం 73 పనులకు రూ.64,721 కోట్లు ఖర్చు అవుతూందని అంచనా వేశారు. 62 పనులకు సంబంధించి రూ.39,678 కోట్లతో టెండర్లు పిలిచారు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో 50 వేల మందికి సెంట్ భూమి ఇచ్చారు. ఈ 50 మందికి వేరే ప్రాంతంలో భూమి ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అమరావతి నిర్మాణానికి అప్పులు

అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు సహాయం చేస్తామని ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఏపీ తీసుకునే అప్పుల కిందకు రావని కేంద్ర ఆర్ధిక శాఖ తేల్చి చెప్పింది. అమరావతికి గ్రాంట్స్ కింద రూ.2500 కోట్లు కేంద్రం ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి రూ. 13,400 కోట్లు రుణ సాయం అందనుంది. హడ్కో 11 వేల కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ. 5 వేల కోట్లు రుణం అందించనుంది. అమరావతిలో 106 ప్రభుత్వ, ప్రభుత్వేత రంగ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.

పెండింగ్ లో ఉన్న పనుల పూర్తికి చర్యలు

అమరావతిలో పెండింగ్ లో న్న 19 పనులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి విలువ రూ. 16,871 కోట్లు. ఈ పనులను పూర్తి చేసేందుకు మార్చి, 2025లో టెండర్లు పిలవనున్నారు. అమరావతిలో 6, 203 ఎకరాలు సీఆర్‌డీఏకి మిగిలింది. ఇందులో 1300 ఎకరాలను పలు సంస్థలకు ఇవ్వాలని సీఆర్‌డీఏ భేటీలో నిర్ణయించారు. డెవలప్ చేసిన నాలుగు వేల ఎకరాలను వేలం వేస్తారు. ఇలా వేలం వేయగా వచ్చిన నిధులను రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేస్తారు.

Tags:    

Similar News