Honey Trap Case: హనీట్రాప్ కేసులో మార్కాపురం యువకులు అరెస్ట్
Honey Trap Case: హనీట్రాప్ కేసులో మార్కాపురం యువకులను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.
Honey Trap Case: హనీట్రాప్ కేసులో మార్కాపురం యువకులు అరెస్ట్
Honey Trap Case: హనీట్రాప్ కేసులో మార్కాపురం యువకులను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లాకి చెందిన ఓ వ్యక్తిని ప్రకాశం జిల్లా మార్కాపురం వాసి సంజయ్ హనీట్రాప్ చేశాడు. యువతితో న్యూడ్ వీడియో కాల్స్ చేయించి వాటిని రికార్డ్ చేశాడు. ఆ వీడియోలను చూపించి సంగారెడ్డి వాసిని బెదిరింపులకు గురిచేశాడు. అలా సుమారు 11 లక్షల 20 వేల రూపాయలను వసూలు చేశాడు.
సంజయ్ వేధింపులు మరీ ఎక్కువ కావడంతో సంగారెడ్డి సీసీఎస్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు... ప్రకాశం జిల్లా వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ కి సహకరించిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.