School Holidays: ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. సత్యసాయి జిల్లా, చిత్తూరు,అన్నమయ్య, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో స్కూల్లకు సెలవు ఉంటుంది. ఇదే విషయాన్ని ఈ జిల్లాల్లోని జిలా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో పిల్లలు నేడు స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చారు.
ఈ నెలాఖరుతో చాలా స్కూళ్లకు విద్యాసంవత్సరం ముగుస్తుంది. అలాగే పరీక్షలు కూడా మొదలైపోతున్నాయి. అందువల్ల సెలవును రద్దు చేసి స్కూల్ నిర్వహించే అవకాశాలు ఇక ఉండకపోవచ్చు. విద్యార్థులు కూడా సెలవు రోజు పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపించరు. తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడతారు. సెలవు రోజు కూడా తాము అధిక శ్రమ తీసుకోవాల్సి ఉంటుందని ఫీలవుతుంటారు. అందువల్ల అధికారులు అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు.
రేపు ఆదివారం కాబట్టి రేపు కూడా పాఠశాలలకు సెలవు ఉంటుంది. అంటే వరుసగా రెండు రోజలు సెలవులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు సోమవారం కూడా సెలవు తీసుకుని టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. వరుసగా 3రోజులు సెలవు ఉండేలా చూసుకుంటారు. అయితే ఇప్పుడు పిల్లలకు పరీక్షల హడావుడి ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో సోమవారం సెలవు ఇచ్చేందుకు పాఠశాలలు సిద్ధగా ఉండవు.