ఏపీ సర్కారు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

AP High Court: ఏపీ సర్కారు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2022-08-17 12:45 GMT

ఏపీ సర్కారు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

AP High Court: ఏపీ సర్కారు తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కేసులు ఎలా ఉపసంహరించుకుంటారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల అనుమతి తీసుకోవాలని చెప్పినప్పటికీ కేసులు ఎలా విత్‌డ్రా చేసుకుంటారంటూ మండిపడింది. ఇలా తమ అనుమతి లేకుండా కేసుల ఉపసంహరణ దేనికి సంకేతమంటూ నిలదీసిన ధర్మాసనం.ఇది కోర్టు ధిక్కారం కిందకి వస్తుంది కదా..? అని తెలిపింది.

తాము అనుమతి ఇచ్చిన తర్వాతే ఉపసంహరణపై ప్రభుత్వం జీవోలు ఇవ్వాలి కదా అని ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ జీవోలను తాము కొట్టేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హైకోర్టు ఈ దశలో ఏం చేయాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని సూచించింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఇతర ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల ఉపసంహరణను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News