విశాఖకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ
High Court: హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు
విశాఖకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ
High Court: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపుపై ఏపీ హై కోర్ట్ లో విచారణ జరిపింది. విశాఖకు కార్యాలయాలు తరలించ వద్దన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. తాము దాఖలు చేసిన రిట్ ను లంచ్ మోషన్ గా తీసుకోవాలని సీజే ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు ప్రభుత్వ తరపు న్యాయవాది. అంత అత్యవసరమేముందంటూ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది సీజే ధర్మాసనం.
హైకోర్టు ఆదేశాల కారణంగా విశాఖలో జరగాల్సిన రివ్యూ మీటింగ్స్ ఇతర కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ప్రభుత్వ న్యాయవాది. తెలిపారు. ప్రొసీజర్ ప్రకారం మంగళవారమే ప్రభుత్వ వాదనలు వింటామని సిజే దర్మాసనం తెలిపింది. కనీసం రేపయినా తమ వాదనలు వినాలని సి.జే ధర్మాసనాన్ని అభ్యర్థించారు ప్రభుత్వ న్యాయవాది. అంత అర్జెన్సీ ఏమి కనబడడంలేదని అభిప్రాయపడింది సిజే ధర్మాసనం. మంగళవారమే వాదనలు వింటామని స్పష్టం చేసింది.