Krishna River: కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి

Krishna River: కృష్ణానదీ బ్యాక్ వాటర్‌లో నీట మునిగిన సప్తనది సంగమేశ్వర ఆలయం * 80శాతం నీటిలో మునిగిన గర్భాలయం

Update: 2021-07-24 03:47 GMT

కృష్ణ రివర్ కు పెరిగిన వరద ఉదృతి (ఫోటో ది హన్స్ ఇండియా)

Krishna River: కర్నూల జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. సప్తనదుల సంగమప్రదేశంలో వెలిసిన సంగమేశ్వరుడి గర్భగుడిలోకి కృష్ణవేణి వచ్చి చేరింది. కృష్ణానదికి వరద నీరు పోటెత్తడంతో సంగమేశ్వర ఆలయంలోకి నీరు పొటెత్తింది. దీంతో ఆలయం మొత్తం నీటిలో మునిగింది. కేవలం గోపురం మాత్రమే దర్శనమిస్తోంది. ఈనెల 20న గర్భగుడిలోకి రెండు అడుగుల మేర నీరు వచ్చి చేరింది. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం గుడి గోపురం మాత్రమే కనిపించేలా నీటిలో చిక్కుకుంది. గోపురం మాత్రమే భక్తులకు దర్శనమిస్తోంది. దీంతో పూజారులు ఆలయ శిఖరానికి పూజలు చేసి.. సంగమేశ్వర స్వామికి వీడ్కోలు పలికారు. ప్రతి ఏడాది ఈ ఆలయం నీటిలో మునుగుతుంది. సంపూర్ణ జలాధివాసంలోకి చేరువలో ఉంది.

ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద పొటెత్తడంతో ఆత్మకూరు డివిజన్‌లో బ్యాక్ వాటర్ నీటిమట్టం పెరిగింది. దాంతో కృష్ణామ్మ ఒడిలో సంగమేశ్వరుడు ఒదిగిపోయాడు. కృష్ణానది బ్యాక్ వాటర్‌లో సప్తనది సంగమేశ్వరం ఆలయం నీట మునిగింది. ఈ ఆలయం ఇప్పటికే 80శాతం నీట మునిగింది. గర్భాలయ శిఖగోపురంతో పాటు ఐదు ఉప ఆలయాల గోపురాలు మాత్రమే నీటిపై దర్శనమిస్తున్నాయి. వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మరో రెండు రోజుల్లో ఆలయం పూర్తిగా నీట మునిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ క్షేత్రం సంపూర్ణ జలాధివాసంలోకి వెళ్లనుంది. సంగమేశ్వర క్షేత్ర జలాధివాసం దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నాయి. ప్రతిఏటా ఇలానే దర్శనమిచ్చే సంగమేశ్వరుడు.. మరో ఎనిమిది నెలల తర్వాత భక్తులకు తిరిగి దర్శనమివ్వనున్నాడు. 

Tags:    

Similar News