Heavy Rains in AP: ఏపీలో ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు

Heavy Rains in AP: ఎడ‌తెరపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు ‌తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. వాయువ్య బంగాళ‌ఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.

Update: 2020-08-16 09:57 GMT
heavy rains in ap the godavari river overflowing

Heavy Rains in AP: ఎడ‌తెరపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు ‌తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. వాయువ్య బంగాళ‌ఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తూర్పుగోదావరిలో గోదావ‌రి ఉధృతి క్ర‌మక్ర‌మంగా పెరుగుతుంది. తూర్పుగోదావరిలోని దేవీపట్నం మండలంలోని 36 గ్రామాల పోలవరం కాపర్ డ్యాం బ్యాక్ వాటర్ తో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

వరద భయంతో గిరిజన గ్రామాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాయి. వరద ఉదృతి పెరుగుతుండటంతో వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. నాలుగైదు రోజులుగా తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మ‌రో వైపు క‌రోనా విభృజిస్తుంది. కరోనా భయంతో వరద బాధితులు పునరావాస కేంద్రాల కు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో తప్ప గ్రామాలకు వరద సహాయం అంద‌డం లేదు. త్రాగు నీరు, నిత్యావసరాలు, కిరోసిన్ కోసం వరద బాధితుల ఎదురుచూస్తున్నారు. మ‌రోవైపు పునరావాస కేంద్రాల‌కు వచ్చిన వారికి మాత్రమే వరద సహాయం అని అధికారులు తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి చెల్లించకుండా గ్రామాలను ఖాళీ చేస్తే భవిష్యత్తులో పరిహారం రాదని, గ‌తేడాది ప్ర‌కటించిన వ‌ర‌ద స‌హాయం ఇప్ప‌టికీ రాలేద‌ని అభద్రతా భావంతో గ్రామాల్లోనే బిక్కు బిక్కు మంటూ బాధితులు గడుపుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో కేవలం పది శాతం మాత్రమే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు.  

Tags:    

Similar News