Andhra Pradesh: ఏపీలో భారీ వర్షాలు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు
దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం (AP Weather Report) మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 19న అది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి సవ్వడి వెల్లడించారు.
Andhra Pradesh: ఏపీలో భారీ వర్షాలు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు
విశాఖపట్నం: దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం (AP Weather Report) మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 19న అది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి సవ్వడి వెల్లడించారు.
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు (Rains in Andhra Pradesh) కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రెడ్ అలర్ట్: విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు.
ఆరెంజ్ హెచ్చరిక: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు.
ఎల్లో అలర్ట్: కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు జారీ చేశారు.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.