Andhra Pradesh: రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం

Update: 2021-11-25 05:45 GMT

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: భారీ వర్షాలతో ఇప్పటికే అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. రేపటి నుంచి మూడు రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక-దక్షిణ తమిళనాడు తీరానికి చేరే అవకాశముందని తెలిపింది.

అల్పపీడన ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలపై పడే అవకాశం ఉందని వివరించింది. అలాగే, కోస్తాలోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News