Heavy Rains: ఏపీలో కొనసాగుతున్న వర్ష బీభత్సం

*చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు *జలదిగ్బంధంలో అనేక గ్రామాలు *భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు

Update: 2021-11-20 02:56 GMT

ఏపీలో కొనసాగుతున్న వర్ష బీభత్సం(ఫైల్ ఫోటో)

Heavy Rains: ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో వరద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాగులు, కాల్వలు పొంగి ప్రవహించగా, చెరువు కట్టలు తెగిపోయి దక్షిణ కోస్తా, సీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి.

వరద నీరు ఉవ్వెతున్న ఎగసిపడడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పశువులు, కోళ్లు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించింది.

అటు రాయలసీమ జిల్లాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల బస్సు సర్వీసులను నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, భారీ వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగింది. ఇక విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా కడప జిల్లా అతలాకుతలమయ్యింది. చెయ్యేరు నది పరివాహక పరిధిలోని పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చెయ్యేరు వంతెన వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టింది. వరదల ఉధృతి నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఇవాళ కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఇటు కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా కడప మీదుగా నడుస్తున్న పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. 

Full View


Tags:    

Similar News