మండూస్ ప్రభావంతో నాయుడుపేటలో ఈదురుగాలులతో భారీవర్షం
* ఎడతెరపిలేని వర్షాలతో స్తంభించిన జనజీవనం
మండూస్ ప్రభావంతో నాయుడుపేటలో ఈదురుగాలులతో భారీవర్షం
Mandous Cyclone: మండూస్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఈదురు గాలులు ప్రజలను ఇబ్బంది పెట్టారు. నిన్న తెల్లవారుజామునుంచి ముసురు వాతారణం నెలకొంది. ఎడతెరపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. గాలుల బీభత్సానికి చెట్లు తెగిపడటంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం నాయుడు పేట చేరుకుంది. జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆదేశాలతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.